Published on Sep 10, 2025
Apprenticeship
డీఆర్‌డీఓ ఐటీఆర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్‌డీఓ ఐటీఆర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

చండీపూర్‌, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) గ్రాడ్యుయేట్‌, డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 32 

2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 22

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, బీబీఏ, బీకాం  ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; టెక్నీషియన్‌కు రూ.8000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డైరెక్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌, చండీపుర్‌, బాలాసోర్‌, ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20-10-2025.

Website:https://drdo.gov.in/drdo/