Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Apr 2, 2026
Internship
డీఆర్‌డీఓ-ఐఎన్‌ఎంఏఎస్‌లో పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు
డీఆర్‌డీఓ-ఐఎన్‌ఎంఏఎస్‌లో పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

దిల్లీలోని డీఆర్‌డీఓ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌‌ అలైడ్‌ సైన్సెస్‌(ఐఎన్‌ఎంఏఎస్‌) 6 నెలల కాలానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ విద్యార్థుల కోసం పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటేషనల్‌ న్యూరోసైన్స్‌/మెషిన్‌ లెర్నింగ్‌, బయోటెక్నాలజీ/బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, లైఫ్‌ సైన్స్‌, కెమిస్ట్రీ/కెమికల్‌ సైన్సెస్‌/కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాకాలజీ తదితరాలు.

అండర్‌ గ్ర్యాడుయేట్‌ ఇంటర్న్‌షిప్‌: 03 ఖాళీలు

పోస్ట్‌ గ్ర్యాడుయేట్‌ ఇంటర్న్‌షిప్‌: 05 ఖాళీలు

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, పీజీ(ఎంఎస్సీ/ఎంటెక్‌) చివరి ఏడాది చదువున్న అభ్యర్థులు. 

స్టైపెండ్‌: నెలకు 5,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ research-academic@gov.in ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.04.2026.

Website:https://drdo.gov.in/drdo/en