Published on Jun 17, 2025
Government Jobs
డీఆర్‌డీఓ- ఆర్‌ఏసీలో సైంటిస్ట్‌-బి పోస్టులు
డీఆర్‌డీఓ- ఆర్‌ఏసీలో సైంటిస్ట్‌-బి పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ (డీఆర్‌డీఓ), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఇతర విభాగాలలో సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 152.

వివరాలు: 

1. డీఆర్‌డీఓలో సైంటిస్ట్-బి- 127 

2. ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9 

3. ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 16 

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ.

అర్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో వ్యాలిడ్‌ గేట్ స్కోర్‌తో పాటు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. చివరి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు కూడా అర్హులు.

వయోపరిమితి: జనరల్ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 ఏళ్లు; ఓబీసీ- 38ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ వారికి 40 ఏళ్లు మించకూడదు. దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు అదనపు సడలింపు ఉంటుంది.

బేసిక్‌ పే: నెలకు రూ.56,100.

ఎంపిక ప్రక్రియ: గేట్‌(GATE) స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 4.7.2025

Website:https://rac.gov.in/index.php?lang=en&id=0