బెంగళూరులోని డీఆర్‌డీవో- సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్స్ సిస్టమ్ (సీఏబీఎస్) వివిధ విభాగాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 10
వివరాలు:
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, గేట్ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.37,000.
వయోపరిమితి: 31.12.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ jrf.rectt.cabs[at]gov.in ద్వారా ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 25, 26.02.2026.