న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2024, అక్టోబరు 20న దుబాయ్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కివీస్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది.
* పురుషులు, మహిళల క్రికెట్ రెండింట్లోనూ న్యూజిలాండ్ నెగ్గిన తొలి టీ20 ప్రపంచకప్ ఇదే. మహిళల జట్టు 2009, 2010లో రన్నరప్‌గా నిలిచింది. పురుషుల జట్టు 2021 ఫైనల్లో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో అమ్మాయిల జట్టు 2000లో విజేతగా నిలవగా, పురుషుల జట్టు ఏదీ గెలవలేదు.