Published on Mar 8, 2025
Current Affairs
టి-72 యుద్ధ ట్యాంకులు
టి-72 యుద్ధ ట్యాంకులు

భారత సైన్యంలోని టి-72 యుద్ధ ట్యాంకులకు శక్తిమంతమైన ఇంజిన్లు అమర్చనున్నారు. వీటి కొనుగోలు కోసం రష్యాకు చెందిన రోసోబోరాన్‌ ఎక్స్‌పోర్ట్‌తో రూ.2,156 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ 2025, మార్చి 7న తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా 1,000 హెచ్‌పీ ఇంజిన్లను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా సరఫరా చేస్తుంది. చెన్నైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఈ టెక్నాలజీని అందుకుంటుంది.

టి-72 ట్యాంకులు ప్రస్తుతం 780 హెచ్‌పీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. వీటిని మెరుగుపరచడం వల్ల యుద్ధరంగంలో ఇవి మరింత చురుగ్గా కదులుతాయి.