హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీహబ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా కవికృత్ 2025, మార్చి 7న నియమితులయ్యారు.
హైదరాబాద్‌కు చెందిన కవికృత్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ, బిట్స్ పిలాని నుంచి ఫైనాన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. హెల్త్‌కేర్ స్టార్టప్ వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత అమెజాన్, పిరమల్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఇటీవలి వరకు ఓయో సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఆ సంస్థ 100కుపైగా నగరాల్లో విస్తరించడంలో, జపాన్‌లో ప్రవేశించడంలో కీలకపాత్ర పోషించారు.