తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీ) వివిధ విభాగాల్లో ఫీల్డ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
విభాగాలు: జియో టెక్నికల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, హైడ్రాలజీ, సిస్మాలజీ.
ఫీల్డ్ ఇంజినీర్: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు.
జీతం: నెలకు రూ.53,580.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 10.