హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
ప్రోగ్రామ్ మేనేజర్- 01
క్వాలిటీ మేనేజర్- 01
ప్రాజెక్ట్ అసోసియేట్- 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్/ బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు రూ.79,060; క్వాలిటీ మేనేజర్ పోస్టుకు రూ.66,080; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.33,040.
వయోపరిమితి: ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు; క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.118.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-09-2024.
Website:https://thsti.res.in/