ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ లోకేషన్లలోని టిస్ కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
వివరాలు:
1. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్: 01
2. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్: 01
3. అకౌంటెంట్: 01
4. అప్పర్ డివిజిన్ క్లర్క్ (యూడీసీ): 02
5. ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ కమ్ ఫీల్డ్ ఆఫీసర్: 02
6. ఫీల్డ్ ఇన్వెస్ట్గేటర్: 25
7. ఆఫీస్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.85,000; ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ పోస్టులకు రూ.65,000; అకౌంటెంట్ పోస్టులకు రూ.45,000; ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,000; మిగతా పోస్టులకు రూ.35,000.
పని ప్రదేశాలు: ముంబయి, దేహ్రాదూన్, ఉత్తరాఖండ్.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-11-2024.
Website:https://www.tiss.edu/