ఆటోమొబైల్ దిగ్గజమైన టయోటా, జపాన్‌లో వినూత్నంగా ఒక ‘టెస్ట్ సిటీ’ నిర్మిస్తోంది.
రోబోలు, ఏఐ యంత్రాలు, అటానమస్ వాహనాల లాంటి అధునాతన సాంకేతిక ఉపకరణాలను పరీక్షించే అవకాశం ఈ టెస్ట్ సిటీలో ఉంటుంది.
దీనికోసం 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.87,000 కోట్లు) వెచ్చిస్తోంది.
మౌంట్ ఫుజీ సమీపంలోని వూవెన్ సిటీ వద్ద దీన్ని సిద్ధం చేస్తోంది.
దాదాపు 47,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి దశను ఇప్పటికే పూర్తి చేశారు.
మొత్తం పూర్తయ్యే నాటికి 2.94 లక్షల చదరపు మీటర్ల ‘టెస్ట్ సిటీ’ ప్రాంగణం సిద్ధం అవుతుంది. ఈ ప్రదేశంలో గతంలో టయోటా ఆటో ప్లాంట్ ఉంది.
ఇక్కడ నిర్మిస్తున్న టెస్ట్ సిటీ పరిశోధకులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ప్రయోగశాల మాదిరిగా ఉపయోగపడుతుందని టయోటా పేర్కొంది.