భారత వన్డే, టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ 2025, మే 7న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2024లో భారత్ టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పాడు.
రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ పలికిన హిట్‌మాన్ ఇకపై వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. టెస్ట్ అరంగ్రేట మ్యాచ్‌లోనే (వెస్టిండీస్‌పై) సెంచరీ చేసిన ఆటగాళ్లలో రోహిత్ ఒకరు.
ఈయన సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది
టెస్టుల్లో రోహిత్ మొత్తం 67 మ్యాచ్‌లు ఆడి.. 4301 పరుగులు చేశాడు. వాటిలో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.