ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్‌కు 12వ స్థానం లభించింది.
క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్’ ఈ జాబితాను ఇటీవల విడుదల చేసింది.
గ్రీస్ మొదటి స్థానంలో నిలిచింది.
అమెరికా 13వ ర్యాంకులో ఉంది.
ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో ఐదో స్థానంలో ముంబయి ఉంది.
వడాపావ్, పావ్‌బాజీ వంటి ముంబయి వంటకాలకు అధిక రేటింగ్‌లు వచ్చాయని టేస్ట్ అట్లాస్ చెబుతోంది.