Published on Jan 6, 2026
Government Jobs
టీసీఐఎల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
టీసీఐఎల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బిహార్ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 25

వివరాలు:

1. ప్రాజెక్ట్ మేనేజర్ - 01

2. ఆపరేషన్ లీడ్ - 03

3. ఇంజినీర్ ఎల్ -3 స్పెషలిస్ట్ - 03

4. పోర్టల్ అడ్మినిస్ట్రేటర్  - 01

5. ఇంజినీర్ ఎల్ -2 నెట్‌వర్క్ & మానిటరింగ్ - 06

6. హెల్ప్‌డెస్క్ ఇంజినీర్ - 06

7. వీడియో కాన్ఫరెన్సింగ్ కోఆర్డినేటర్ - 04

8. స్టోర్ ఇన్‌ఛార్జ్ - 01

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.22,546. - రూ.1,80,370.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఈడి (డిటి) నెం. 501, టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టిసిఐఎల్ భవన్, గ్రేటర్ కైలాష్ -I, దిల్లీ  - 110048

దరఖాస్తు చివరి తేదీ: 09.01.2026. 

Website:https://www.tcil.net.in/current_opening.php