Published on Nov 14, 2024
Government Jobs
టీవీవీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
టీవీవీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు టీవీవీపీ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 64

వివ‌రాలు:

విభాగాల వారీగా..

1. ఓబీ/జీవై: 17

2. అనస్తీషియా: 11

3. పీడియాట్రిక్స్‌: 12

4. రేడియాలజీ: 08

5. జనరల్ మెడిసిన్: 10

6. ఆర్థోపెడిక్స్‌: 02

7. జనరల్ సర్జరీ: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.1,00,000.

వయో పరిమితి: 46 ఏళ్లు మించకూడదు.ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రొగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్ అండ్ ఐ), ఖైరతాబాద్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 26-11-2024.

Website:https://hyderabad.telangana.gov.in/