టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా సుదర్శన్ వేణు నియమితులయ్యారు. 2025, ఆగస్టు 25 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఛైర్మన్ రాల్ఫ్ స్పెత్ స్థానంలో సుదర్శన్ వేణు ఈ బాధ్యతలు చేపడతారు.