అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ఇందులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు, తుర్కియే, ఖతార్ దేశాల ప్రతినిధులు ఉంటారు. వీరితో పాటు.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ నేతలను కూడా మండలిలోకి ఆహ్వానించారు.