అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో ‘ఇన్‌స్టిట్యూషన్స్’ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని ట్రిపుల్ ఐటీ (డీఎం) ప్రాంగణం తొమ్మిదో స్థానంలో నిలిచింది.
2024, నవంబరులో సింగపూర్‌లో ‘వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్-2024’ నిర్వహించారు.
అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు పోటీపడ్డాయి.
అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించారు.
కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో రూ.254 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ట్రిపుల్‌ఐటీ కళాశాల(డీఎం) ప్రాంగణాన్ని నిర్మించారు.