Published on Dec 20, 2024
Admissions
ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్‌డీ ప్రోగ్రాం
ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్‌డీ ప్రోగ్రాం

 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) జనవరి 2025లో ప్రారంభం కానున్న పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

1. పీహెచ్‌డీ ప్రోగ్రాం (ఫుల్‌/ పార్ట్ టైం)- జనవరి 2025

2. ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ ప్రోగ్రాం

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌, యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌/ డీఏఈ-జెస్ట్‌/ ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌లో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22/12/2024.

రాత పరీక్ష, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 24/12/2024.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 30/12/2024.

ఫలితాల ప్రకటన: 01/01/2025.

Website:https://iiitk.ac.in/

Apply online:https://iiitk.ac.in/Ph.D.-Admission/page