తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన, సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రిట్రాన్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది.
33 జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లను 2024, నవంబరు 2న జరిగిన వైద్యఆరోగ్యశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
వారంలో రెండు రోజులు (మంగళ, గురువారాలు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి.