2025లో మన దేశంలో మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న టెక్ అంకురాలు 407 విడతల్లో 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10,000 కోట్లు) సమీకరించాయని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్సన్ నివేదికలో పేర్కొంది. 2024లో సమీకరించిన 1.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ.. ఫండింగ్ రౌండ్ల సంఖ్య 29 శాతం తగ్గినప్పటికీ (2024లో 580 నుంచి 2025లో 407కు), మధ్య స్థాయి ఒప్పందాల సగటు పరిమాణం 2024లో 2.4 మి.డాలర్ల నుంచి 2025లో 3.8 మిలియన్ డాలర్లకు పెరిగింది.