ఫిన్‌టెక్ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్‌కు మూడో ర్యాంకు దక్కింది. 2023తో పోలిస్తే 2024లో 33 శాతం మేర నిధుల రాక తగ్గినా కూడా ఈ స్థానం దక్కించుకుంది.
ట్రాక్షన్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ అనిశ్చితులుండడంతో మొత్తం మీద గిరాకీ తగ్గడంతో ఈ రంగానికీ నిధుల రాక క్షీణించిందని అందులో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
2024లో ఫిన్‌టెక్ రంగం 1.9 బిలియన్ డాలర్ల మేర సమీకరించింది. 2023లో వచ్చిన 2.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 33 శాతం తక్కువ. అయినప్పటికీ.. నిధుల సమీకరణ విషయంలో ఈ రంగం అమెరికా, బ్రిటన్ తర్వాతి స్థానంలో నిలిచింది.
2022లో భారత ఫిన్‌టెక్ రంగం 5.6 బి. డాలర్లను సమీకరించింది.