Published on Jan 13, 2026
Current Affairs
ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
  • సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్యనగర్‌లో ఉన్న ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. కదులుతున్న ఒక లక్ష్యంపైకి దీన్ని ప్రయోగించి చూసినట్లు రక్షణశాఖ తెలిపింది. అలాగే ట్యాంకు పైభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్నీ పరీక్షించినట్లు వివరించింది.
  • ఇది మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఎంపీఏటీజీఎం). మూడోతరానికి చెందిన ఈ క్షిపణి.. నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తించి, దాన్ని ధ్వంసం చేయగలదు.