ప్రపంచవ్యాప్తంగా దాతృత్వంలో మిన్నగా ఉంటున్న, అత్యంత ప్రభావశీలురైన 100 మందితో కూడిన జాబితాను టైమ్స్ మ్యాగజైన్ 2025, మే 20న విడుదల చేసింది.
ఆ జాబితాలో మనదేశం నుంచి ముకేశ్- నీతా అంబానీ దంపతులు, విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఉన్నారు.
ఫౌండేషన్లు, లాభాపేక్ష లేని సంస్థలను స్థాపించిన వారు ఎంతో ఉదారంగా, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నారని ‘ద టైమ్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఫిలాంత్రపీ 2025’ జాబితా వెల్లడించింది.
దీని ప్రకారం..
నీతా, ముకేశ్ దంపతులు 2024లో రూ.407 కోట్లు (48 మి. డాలర్లు) విరాళంగా ఇచ్చారు.
ఈ దంపతుల వ్యాపార సామ్రాజ్యం 110 బిలియన్ డాలర్లుగా ఉంది.
భారత్‌లో అత్యంత ఉదారత కలిగిన వ్యక్తుల్లో ప్రేమ్‌జీ ఒకరు.
2013లో గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం పెట్టిన తొలి భారతీయుడు ప్రేమ్‌జీనే.
2023-24లో సంప్రదాయ విరాళాలతో పాటుగా, 109 మి. డాలర్ల (దాదాపు రూ.950 కోట్ల)ను విద్య, ఆరోగ్యం, తదితర రంగాల్లోని 940 సంస్థలకు విరాళం ఇచ్చారు.