భారత కృత్రిమ మేధ (ఏఐ) విపణి పరిమాణం 2025లో 45 శాతం సంచిత వృద్ధితో 28.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.50 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. భారత డిజిటల్ ఆర్థికవ్యవస్థలో ఏఐ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగాలకు గిరాకీ గణనీయంగా పెరగడమే కాకుండా.. వేతనాలపరంగా కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఇదే సమయంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటోందని విశ్లేషించింది. జెన్‌ఏఐ విభాగంలో ప్రతి 10 ఉద్యోగ ఖాళీలకు గాను ఒక్కరే అర్హులైన ఇంజినీర్ ఉంటున్నారని పేర్కొంది.