ఏటా ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను సమీక్షించే నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ ‘టామ్‌టామ్ ఇండెక్స్- 2025’ వివరాలను వెల్లడించింది. ఈ సూచీలో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో మెక్సికో తొలి స్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. పుణె 5వ స్థానంలో, ముంబయి 18, దిల్లీ 23, కోల్‌కతా 29, జైపుర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచాయి.
2024లో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు.. ఏడాదిలోనే రెండో స్థానానికి వచ్చేసింది.