టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. అతడు పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2022లో అతడు రిటైరయ్యాడు. నామినీల్లో 75 శాతం ఓట్లు వచ్చిన వారికి హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభిస్తుంది. పాత్రికేయులు, అభిమానులు, హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు తదితరులు ఓట్లు వేశారు.