టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (38) 2024 నవంబరు 20న ఆట నుంచి రిటైరైపోయాడు. అత్యంత విజయవంతమైన తన కెరీర్‌ను అతడు ఓటమితో ముగించాడు.
స్పెయిన్‌లో జరిగిన డేవిస్ కప్ ఫైనల్స్‌లో అతడు 4-6, 4-6తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్ జాండ్‌షల్ప్ చేతిలో ఓడిపోయాడు.
2001లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన వారిలో జకోవిచ్ (24) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచాడు.
యుఎస్ ఓపెన్‌ను నాలుగు సార్లు సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండేసి సార్లు ట్రోఫీ ముద్దాడాడు. నాదల్ చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. ఒలింపిక్స్‌లో నాదల్ 2008లో సింగిల్స్, 2016లో డబుల్స్ స్వర్ణాలు గెలిచాడు.