టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా ఎన్.గణపతి సుబ్రమణియమ్ 2025, మార్చి 14న నియమితులయ్యారు.
ఆయన 2021, డిసెంబరు 2న టాటా కమ్యూనికేషన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా చేరారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారత ఐటీ పరిశ్రమకు ఆయన 40 ఏళ్లుగా సేవలు అందిస్తూ వచ్చారు.
టీసీఎస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన, 2024 మేలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.