తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ సంస్థ అయిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్, తిరుపతిలో ఒప్పంద ప్రాతిపదికన రెండేళ్ల కాలపరిమితికి గాను వివిధ స్పెషాలిటీ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 30
వివరాలు:
1. ప్రొఫెసర్
2. అసోసియేట్ ప్రొఫెసర్
3. అసిస్టెంట్ ప్రొఫెసర్
4. మెడికల్ ఆఫీసర్
5. రెసిడెంట్ డాక్టర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మించకూడదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,50,000.అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.2,00,000.అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,50,000.మెడికల్ ఆఫీసర్/రెసిడెంట్ డాక్టర్ కు రూ.80,000- రూ.1,00,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: డైరెక్టర్, బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్, టీటీడీ, తిరుపతి - 517501, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-03-2026.
Website:https://www.tirumala.org/