తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్- 2025), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌సెట్-2025) నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీజీసీహెచ్‌ఈ) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
వివరాలు:
తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ లాసెట్), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఎల్‌సెట్)-2025
కోర్సులు: మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ; అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్; ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష మాధ్యమం: లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, ఉర్దూ; పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము: లాసెట్‌కు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్‌సెట్‌కు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900).
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-03-2025 నుంచి 15-04-2025 వరకు.
పరీక్ష నిర్వహణ తేదీ: 06-06-2024.
Website:https://lawcet.tsche.ac.in/