Published on Mar 13, 2025
Admissions
టీజీ పీజీఈసెట్‌ - 2025
టీజీ పీజీఈసెట్‌ - 2025

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు:

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025

కోర్సులు: ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి

విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ప్రాంతీయ కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600).

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.

పరీక్ష వ్యవధి: 2 గంటలు, 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు.

మార్చి 17 నుంచి మే 19 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం.

మే 22 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం.

మే 22 రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం.

మే 25 రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం.

మే 30 రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం.

జూన్‌ 02 రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం.

జూన్‌ 7వ తేదీ నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం

జూన్‌ 16 నుంచి జూన్‌ 19 వరకు: 19 సబ్జెక్టులకు పరీక్షలు

Website:https://pgecet.tgche.ac.in/

Apply online:https://pgecet.tgche.ac.in/