Published on Mar 31, 2025
Admissions
టీజీ పీఈసెట్‌-2025
టీజీ పీఈసెట్‌-2025

వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీజీ పీఈసెట్‌)- 2025 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ)

విడుదల చేసింది. దీన్ని మహాబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు:

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్‌-2025)

కోర్సులు: బీపీఈడీ (రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు)

విద్యార్హత: బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01-07-2025 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన

ఉత్తీర్ణతతోపాటు 01-07-2025 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6

కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 400 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. ఒక్కో

ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌

బ్యాడ్మింటన్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి. 

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మార్చి 15 నుంచి మే 24 వరకు: దరఖాస్తుల స్వీకరణ

ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తు గడువు: మే 30

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 05.06.2025.

జూన్‌ 11 నుంచి 14 వరకు: పరీక్షలో భాగంగా అభ్యర్థులకు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో క్రీడల పోటీల నిర్వహణ

Website: https://pecet.tgche.ac.in/

Apply online: https://pecet.tgche.ac.in/