తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2025 నోటిఫికేషన్‌ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్
విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
వివరాలు:
టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ ఎడ్‌సెట్) 2025
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు
డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.550; ఇతరులకు రూ.750.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-05-2025.
ఆలస్య రుసుము రూ.250తో దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2025.
ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తుకు చివరి తేదీ: 24.05.2025.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 29.05.2025.
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష తేదీ: 01-06-2025.
ప్రిలిమినరీ కీ: 05.06.2025.
ఫైనల్ కీ: 21.06.2025.
Website: https://edcet.tgche.ac.in/