తెలంగాణ విద్యుత్తు సరఫరా సంస్థ(టీజీట్రాన్స్‌కో)కు జాతీయస్థాయి ‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ పురస్కారం-2024’ దక్కింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందౌర్‌లోని ఐఐటీలో జరిగిన నేషనల్ పవర్ సిస్టం సదస్సులో కేంద్ర విద్యుత్తు మండలి (సీఈఏ) ఛైర్‌పర్సన్ ఘన్‌శ్యాంప్రసాద్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ సీఎండీ నర్సింహన్ తదితరులు ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌కు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు ట్రాన్స్‌కో 2024 డిసెంబరు 15న తెలిపింది.