Published on Apr 3, 2025
Admissions
టీజీఆర్‌జేసీ సెట్‌- 2025
టీజీఆర్‌జేసీ సెట్‌- 2025

తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్​(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​-2025 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కళాశాలలు​ ఉన్నాయి.  

వివరాలు:

తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025

గ్రూపులు, సీట్లు: ఎంపీసీ- 1,496, బైపీసీ- 1,440, ఎంఈసీ- 60.

మొత్తం సీట్ల సంఖ్య: 2,996.

అర్హత: 2025 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం​ ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజికల్‌ సైన్స్‌; బైపీసీకి ఇంగ్లిష్​, బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23-04-2025.

ప్రవేశ పరీక్ష తేదీ: 10/05/2025.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే నాలుగో వారంలో

Website:https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/