టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) లెక్కింపునకు ప్రస్తుతం ఉన్న 2011-12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2022-23కు మార్చడం కోసం 18 మందితో ఒక కార్యాచరణ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ ఛైర్మన్‌గా ఈ బృందం పనిచేస్తుంది. ప్రాతిపదిక ఏడాది సవరణ కారణంగా దేశంలోని ధరల విషయంలో మరింత వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
ఈ బృందం 2022-23 ప్రాతిపదిక ఏడాదిగా ఉండే డబ్ల్యూపీఐ, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్(పీపీఐ)లలో ఉండాల్సిన వస్తువుల జాబితాను సూచిస్తుంది. అలాగే డబ్ల్యూపీఐ/పీపీఐ లెక్కింపు పద్ధతినీ నిర్ణయిస్తుంది.