ప్రపంచంలోని అందరు బిలియనీర్ల (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.8500 కోట్ల నికర విలువ కలిగిన వారు) సంపద 2024లో 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.170 లక్షల కోట్లు) పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరినట్లు ‘టేకర్స్ నాట్ మేకర్స్’ నివేదిక వెల్లడించింది. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం తొలి రోజున ఆక్స్‌ఫామ్ కంపెనీ ఆర్థిక అసమానత నివేదికను విడుదల చేస్తుంది.
నివేదికలోని అంశాలు:
1990 నుంచీ పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య పెద్దగా మారలేదని.. బిలియనీర్ల సంపద మాత్రం భారీగా పెరుగుతూ వస్తోందని వెల్లడించింది.
2023తో పోలిస్తే మూడింతల వేగంతో బిలియనీర్ల సంపద విలువ పెరిగింది.
ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ 299 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25.42 లక్షల కోట్ల) మేర పెరిగింది. దశాబ్ద కాలంలో కనీసం అయిదుగురు ట్రిలియనీర్లుగా ఎదగొచ్చని అంచనా.