సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన దిల్లీలోని సీఎస్ఐఆర్- ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ యూనిట్ (సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 11
ప్రాజెక్ట్ అసోసియేట్-II: 04
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 06
విభాగాలు: అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, సంస్కృతం, పేటెంట్స్ అగ్రికల్చర్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, పేటెంట్స్-మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, యూజీసీ నెట్ స్కోర్ ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టుకు రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.35,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు: 20, 23, 25, 27, 30-09-2024.
పరీక్ష కేంద్రం: సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్ యూనిట్, 14, సత్సంగ్ విహార్ మార్గ్, కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూ దిల్లీ.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-09-2024.
Website:https://www.csir.res.in/