తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
2024, డిసెంబరు 11న ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో జరిగిన ఓట్ల లెక్కింపులో జితేందర్‌రెడ్డి 34 ఓట్ల ఆధిక్యంతో చాముండేశ్వరినాథ్‌పై విజయం సాధించారు.
జితేందర్‌రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు పోలయ్యాయి. కార్యదర్శిగా మల్లారెడ్డి, కోశాధికారిగా సతీశ్ గౌడ్ ఎన్నికయ్యారు.