Published on Dec 10, 2025
Government Jobs
టీఐఎఫ్‌ఆర్‌లో వర్క్‌ అసిస్టెంట్ పోస్టులు
టీఐఎఫ్‌ఆర్‌లో వర్క్‌ అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. వర్క్‌ అసిస్టెంట్‌(ఆగ్జలరీ): 03

2. వర్క్‌ అసిస్టెంట్‌(టెక్నికల్)(ఫిట్టర్‌): 01

3. ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(బీ): 01

4. ప్రాజెక్ట్ ట్రేడ్స్‌మ్యాన్‌(బీ)(ఎలక్ట్రీషియన్‌): 01

5. ప్రాజెక్ట్ ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 నుంచి 31 ఏళ్లు ఉండాలి. 

వేతనం: నెలకు వర్క్‌ అసిస్టెంట్‌కు రూ.35,973,  ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.63,900, ప్రాజెక్ట్ ట్రేడ్స్‌మ్యాన్‌, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.41,100. 

ఎంపిక: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 3.

Website:https://www.tifr.res.in/maincampus/careers.php