Published on Dec 27, 2024
Government Jobs
టీఎంసీలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు
టీఎంసీలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌- అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్ (ఏసీటీఆర్‌ఈసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17

వివరాలు:

సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ : 01

నర్స్‌ ‘ఏ’- 04

అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌- 02

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ‘బీ’- 04

టెక్నీషియన్‌ ‘ఏ’- 05

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, బీఈ, హెచ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

జీతం: నెలకు సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ పోస్టుకు రూ.78,800; నర్స్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు రూ.44,900; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.35,400; టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు రూ.19,900. 

వయోపరిమితి: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ పోస్టుకు 45 ఏళ్లు; నర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు; అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు 40ఏళ్లు; టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు 27 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు; ఓబీసీ మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది)

పని ప్రదేశం: ఏసీటీఆర్‌ఈసీ, టాటా మెమోరియల్‌ సెంటర్‌, ఖర్ఘర్‌, నవీ ముంబయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-01-2025.

Website:https://actrec.gov.in/