టాటా మెమోరియల్ సెంటర్‌కు (టీఎంసీ) చెందిన బిహార్, ముజఫర్‌పుర్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
వివరాలు:
టెక్నీషియన్- 13
అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్- 01
క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్- 01
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబర్ కమ్ మెషన్, ఎంజీపీఎస్
అర్హత: టెక్నీషియన్ పోస్టులకు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు టెక్నీషియన్ పోస్టుకు రూ.22,568; అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్‌కు రూ.24,804; క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్‌కు రూ.22,568.
వయోపరిమితి: టెక్నీషియన్, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ పోస్టుకు 27 ఏళ్లు, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ 30 ఏళ్లు మించకూడదు.
వేదిక: హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ ఉమానగర్ ముజఫర్‌జంగ్ బిహార్.
దరఖాస్తు విధానం: మెయిల్ ద్వారా టెక్నీషియన్ పోస్టులకు 31.01.2025, 03.02.2025 తేదీల్లో; అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులకు 04.02.2025 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవాలి.
ఈమెయిల్:recruitment@hbchrcmzp.tmc.gov.in
ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05.02.2025.
Website:https://tmc.gov.in/