ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్‌లో నడుస్తున్న టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ (టీఎస్‌టీఎల్)కు విశిష్ట గుర్తింపు లభించింది. దేశంలో 5జీ నెట్వర్క్, యాక్సెస్, మొబిలిటీ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ (ఏఎంఎఫ్), 5జీ గ్రూప్-1 పరికరాలను పరీక్షించడానికి టీఎస్‌టీఎల్‌ను అధికారిక ప్రయోగశాలగా కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ధ్రువీకరించింది. ఇలా గుర్తింపు పొందిన మొదటి ల్యాబ్ ఇదే. ఈ ధ్రువీకరణ 5జీ మొబైల్ టెలికాం పరికరాల అత్యాధునిక భద్రతా అంచనాలను దేశీయంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.