Published on Nov 15, 2025
Government Jobs
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ- ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ- ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 60

వివరాలు:

1. సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టులు (మొత్తం 10 పోస్టులు)

సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/జనరల్‌)- 2

సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్‌)- 3

సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ/సెరాలజీ): 3

సైంటిఫిక్ ఆఫీసర్ (కంప్యూటర్స్‌): 2

2. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు (మొత్తం 32 పోస్టులు)

సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/జనరల్‌): 5

సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్‌): 10

సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ/సెరాలజీ): 10

సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్స్‌): 7

3. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు (మొత్తం- 17)

ల్యాబ్ టెక్నీషియన్ (ఫిజికల్/జనరల్‌): 2

ల్యాబ్ టెక్నీషియన్ (కెమికల్‌): 6

ల్యాబ్ టెక్నీషియన్ (బయోలజీ/సెరాలజీ)- 4

ల్యాబ్ టెక్నీషియన్ (కంప్యూటర్స్‌)- 5

4. ల్యాబొరేటరీ అటెండెంట్: 1 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/బైపీసీ), ఎంఏ/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; ఎక్స్‌సర్విస్‌మెన్‌లకు మూడేళ్లు; దివ్యాంగులకు 10ఏళ్లు; తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

జీతం: సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు రూ.45,960- రూ,1,24,150; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.42,300- రూ.1,15,270; ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ24,280- రూ.72,850; ల్యాబ్ అటెండెంట్‌కు రూ.20,280- రూ.62,110.

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులు, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ ఆఫీసర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.2,000 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000); ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.1200(ఎస్సీ/ఎస్టీలకు రూ.600); ల్యాబ్ అటెండెంట్‌కు రూ.1000(ఎస్సీ/ఎస్టీలకు రూ.500).

దరఖాస్తు ప్రారంభం: 27.11.2025.

దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025.

Website:https://www.tgprb.in/