Published on Dec 17, 2025
Government Jobs
టీఆర్‌ఏఐలో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు
టీఆర్‌ఏఐలో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని టెలీకామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల గేట్‌ స్కోర్‌ ఆధారంగా  భర్తీ చేయనుంది. 

వివరాలు:

టెక్నికల్‌ ఆఫీసర్‌: 06 పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిరల్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023/2024/2025 అర్హత కలిగి ఉండాలి. 

జీతం: నెలకు రూ.56,100.

వయోపరిమితి: 31.10.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 04.01.2026.

Website:https://www.trai.gov.in/vacancies