ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ (49) 2024, నవంబరు 28న ప్రమాణ స్వీకారం చేశారు.
రాంచిలోని మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. హేమంత్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.