కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న కనానాస్కిస్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సు 2025, జూన్ 15న ప్రారంభమైంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ సహా పలువురు అగ్ర నేతలు ఇందులో పాల్గొననున్నారు.
3 దేశాల పర్యటనలో భాగంగా జూన్ 15న ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ చేరుకున్నారు. ఆ
యనకు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ సాదర స్వాగతం పలికారు.
రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
సైప్రస్ పర్యటన అనంతరం.. ప్రధాని మోదీ కెనడా వెళ్లి అక్కడ జరగనున్న జీ7 సదస్సులో పాల్గొంటారు.
అక్కడి నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్తారు.