బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో 2024, నవంబరు 19న జరిగిన జీ20 సదస్సులో కొన్ని తీర్మానాలను సభ్యదేశాలు ఆమోదించాయి.
ఆకలిని జయించడానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటుతోపాటు గాజాకు మరింత సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని జీ20 సదస్సు తీర్మానించింది.
వాటితోపాటు సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలను చేపట్టాలని సూచించింది. అయితే ఈ ఉమ్మడి తీర్మానంపై పూర్తిగా ఏకాభిప్రాయం రాలేదు.
20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితరులున్నారు.