అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా 2024, డిసెంబరు 1న బాధ్యతలు స్వీకరించాడు.
దివంగత జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్.శ్రీనివాసన్ తర్వాత ఆ పదవి చేపట్టిన అయిదో భారతీయుడిగా అతడు నిలిచాడు.
అతి పిన్న వయసులో (36 ఏళ్లు) ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైంది అతడే.
జై షా గత అయిదేళ్లు బీసీసీఐ కార్యదర్శిగా పనిచేశాడు. గుజరాత్‌లోని ఓ జిల్లా క్రికెట్ సంఘం పాలకుడిగా మొదలైన జై షా ప్రయాణం ఇప్పుడు ఐసీసీ పీఠం వరకూ చేరింది.